సినిమాలు-నేనుఆంద్రులకు బాగా ఇష్టమయినవి సినిమాలు,రాజకీయాలునూ. ఏ ఇద్దరు కలిసినా ఎక్కువ భాగం మాట్లాడుకునేవి ఇలాంటి విషయాలే కదా. ఇక సినిమాలను ఇష్టపడని వారు ప్రపంచం మొత్తం మీద అతికొద్దిమందే ఉంటారనడం అతిశయోక్తి కాదు.

నేను ఎక్కువగా ఇష్టపడేవి కామెడీ సినిమాలు, ఇంగ్లీషు యాక్షన్ సినిమాలూ. అదేంటో గాని నేను ఎక్కువగా డబ్బింగ్ సినిమాలను ఇస్టపడుతుంటాను. కొన్ని ఇంగ్లీషువి , తమిళం వి . చెత్త సినిమాలు అన్ని భాషల్లోనూ ఉంటాయి , ఆయా భాషల్లోని మంచి సినిమాలనే డబ్బింగ్ చేస్తారనేది నా లాజిక్.

నాకు తెలుగులోకి డబ్బ్ అయిన తమిళ సినిమా పాటలంటే ఇష్టం . చాలా పాటలు మంచి అర్దాలతొ ఉంటాయి. మ్యూజిక్ కూడా బాగా వుంటుంది.

తెలుగు సినిమల్లో నాకు చిరాకు తెప్పించేది ఏమిటంటే , హీరో హీరోయున్లు ఇతర దేశాల రోడ్ల మీద డాన్సులు చెయ్యడం . వీల్లెవర్రా బాబు అని వాల్లని విదేశీయులు వింతగా చూస్తుంటారు. వీల్లు డాన్స్ చేస్తున్నప్పుడు పక్కన గుడ్డముక్క వేస్తే దాని మీద బోలెడు చిల్లర పోగవుద్ది . అలా వుంటుంది వీల్ల చేష్టలు అక్కడ.

ఇక ఇంగ్లీషు డబ్బింగ్ సినిమాలు చూడ్డం బలే ఎంజాయ్ చేస్తాను . అంత నాణ్యతతో మనవారు సినిమాలు చెయ్యలేరు. మన సినిమాలకి అంతమార్కెట్ లేదు.

ఇది వరకు అయితే స్నేహితులతో కలసి ధియేటర్ లో చూసేవాడిని. ఇప్పుడు ధియేటర్ లో చూడటం బాగా తగ్గించాను. సినిమా కోసం ధియేటర్ వరకు వెల్లి వెయిట్ చేసి సినిమాలా చూడాలన్ని ఇది , ఆసక్తి తగ్గాయి.

కొద్దిరోజులు ఆగితే ఒరిజినల్ డీవీడీ వచ్చేస్తుంది కదా. నా lG 19" LCD మానిటర్ పై సినిమాలు చూస్తుంటే ఇంచుమించు ధియేటర్ లో చూసినట్టే ఉంటుంది . జైయహో డీవీడీ.

. Bookmark the permalink.

7 Responses to సినిమాలు-నేను

 1. తమిళ డబ్బింగ్ పాటల సాహిత్యం బాగుండటం ఒకప్పటి మాట - ఇప్పుడదీ బాగోటం లేదు. ముఖ్యంగా రహమాన్ మెలొడీల్ని ఖూనీ చేసే విధానం దారుణాతిదారుణం :-( అనువాదం కళగా భావించటం రాజశ్రీతో అంతరించిపోయినట్లుంది. డబ్బింగ్ రచయితలకి డబివ్వటం దండగన్నట్లు, ఇప్పుడు నిర్మాతలే సగం తమిళం, సగం తెలుగు కలబోసి అనువాదబ్బండ్లు లాగించేస్తున్నారు. దాని ప్రభావమే ఈ మధ్య విరివిగా తెలుగులో వినొస్తున్న 'పుడింగి', 'అయ్యారేటు', 'స్ట్రాబెర్రీ కళ్లు' లాంటి మాటలు.

 2. తమిళంలో శంకర్ శైలి మన తెలుగువాల్లని పోలి ఉంటుంది . ఇక తెలుగులో రాజమౌళీ పాటలు బాగుంటాయి . మనకున్న లొకేషన్స్ క్రియేటివ్ గా వాడుకుంటూ పాటలో విరుపులు , అందుకు తగ్గట్టుగా హావబావాలతో తీస్తారు.

  ఇక తెలుగులో కొత్తగా వచ్చే క్రియేటివ్ డైరక్టర్లు బాగానే దృష్టిపెడుతున్నారు . అందువల్లే వాల్ల సినిమాలు విజయవంతం అవుతున్నాయి.

 3. >>>> వీల్లు డాన్స్ చేస్తున్నప్పుడు పక్కన గుడ్డముక్క వేస్తే దాని మీద బోలెడు చిల్లర పోగవుద్ది . అలా వుంటుంది వీల్ల చేష్టలు అక్కడ. ...

  చాలా బాగా చెప్పారు.
  విదేశాల్లో మన కుప్పిగంతుల పాటలను ఇవాళ్టి ప్రేక్షకులు ఏమాత్రం ఎంజాయ్ చేయడం లేదు.
  కథకు సంబంధం లేని, కథకు పానకం లో పుడకలా అడ్డుపడే సహజత్వం లేని పాటల మీద అంతంత డబ్బు తగలేసే బదులు కథల మీదా, కథను బలంగా రసాభాస కలగని విధంగా చెప్పడం మీదా దర్శకులు తమ శక్తి యుక్తులను కేంద్రీకరిస్తే బాగుంటుంది.

 4. ఒక పెద్దబడ్జెట్ చిత్రంలో పాటకయ్యే ఖర్చు రమారమి 30 లక్షలు. ఈ మధ్యకాలంలో ఒక కథకుడి(అబ్బూరి రవి)కి ఇచ్చిన పెద్ధ రెమ్యూనరేషన్ 17 లక్షలు. ‘కొంచెం ఇష్టం-కొంచెం కష్టం’సినిమాకు ఇచ్చారు.అది ఇండస్టీ టాక్ అయ్యింది. "అంతిచ్చారా!!!" అని చాలా మంది ముక్కున వేలేసుకున్నారు. అదీ re-work చేసిన పాత కథే.

  రాజమౌళికి కథ అందించే విజయేంద్రప్రసాద్ కథకు 70 లక్షలు తీసుకుంటారని వినికిడి. ఆయన ఈ మధ్య రాసిన సినిమా ‘మిత్రుడు’.ఇదొక చెత్తకథ.

  ఇండస్త్రీలో ప్రస్తుతం చాలా మంది అగ్రహీరోలు కథ లేక సినిమాలు చెయ్యట్లేదు. వెంకటేష్, నాగార్జున,మహేష్ బాబు వీళ్ళలో కొందరు. కానీపరిశ్రమ పెద్దలు బయటోళ్ళ కథలు వినరు. కథ చెప్పేవాడికీ "స్థాయి" కావాలనుకుంటారు. ఇండస్ట్రీలో స్థాయి వచ్చేసరికీ సృజనాత్మ‘కథ’ అడుగంటిపోతుంది. మూసలోతప్ప వాసిలో ఆలోచించే జ్ఞానం నశించిపోతుంది.ఇక కథలెక్కడ్నించీ వస్తాయి? అవెలాగూ రావుగనక,హీరోయిజం,హీరోయిన్ ఎంత బట్టలు వేసింసి(తీసింది),ఏ లోకేషన్ వంటి గొప్ప గొప్ప విషయాలపై శ్రద్ధ పెట్టి నడిపించేస్తారు. మన ఖర్మ.

 5. ఇంగ్లీషు డబ్బింగ్ సినిమాల కంటే డైరెక్ట్ గా ఇంగ్లీష్ సినిమాలు చూస్తే ఇంకా థ్రిల్ ఔతారు...
  డబ్బింగ్ సినిమాల్లో ఆ ఒరైజైన్యాలిటీ ఉందధూ కదా..
  ఏమంటారు?

 6. అవునండి. నేను డైరక్ట్ ఇంగ్లీష్ సినిమాలనే చూస్తుంటాను. ఇదివరకు డైరక్ట్ ఇంగ్లీష్ సినిమాలు హాల్స్ లోకి వచ్చేవి . ఇప్పుడు డబ్బింగ్ లే వస్తున్నాయి.డీవీడీలు ఉండటం వల్ల ఒరిజినల్ వి చూడగలుగుతున్నాను.

Leave a Reply

మీ వాఖ్య వ్రాయండి.